కారును ఢీకొట్టిన లారీ

63பார்த்தது
కారును ఢీకొట్టిన లారీ
ప్రత్తిపాడు మండలం పార్వతీపురం వద్ద శుక్రవారం కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. నరసరావుపేటకు చెందిన పవన్ కుమార్ కుటుంబంతో కారులో గుంటూరు బయలుదేరాడు. పార్వతమ్మగుడి దగ్గర కారు పక్కకు తీసి డోర్ తీయబోయే క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనలో పవన్ కుమార్ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసారు.

தொடர்புடைய செய்தி