ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన బాలుడు నీచు జోయల్ జేమ్స్ సోమవారం ఇంటిపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 11 కెవి కేబుల్ వైరుకు చెయ్యి తగలగా అలానే ఉండిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు గమనించి పక్కనే ఉన్న కర్రతో కొట్టగా బాలుడు స్పృహ కోల్పోయి ఒంటికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని బైకుపై గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.