ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద ఏలూరు ప్రధాన కాలువలో తూడు, గుర్రపు డెక్కలు పేరుకుపోయాయి. దాని మధ్యలో చనిపోయిన పశు కళేబరం ఉండడంతో దుర్వాసనతో భక్తులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఆదివారం మండల ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు దృష్టికి భక్తులు, ప్రజలు తీసుకువెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానన్నారు.