ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో మొత్తం 17 మద్యం దుకాణాలకు సంబంధించి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తం ఐదు దుకాణాలకు 696 దరఖాస్తులు అందాయని సంబంధిత అధికారులు గురువారం తెలిపారు. అలాగే దరఖాస్తులు గడువు ప్రక్రియ నేటితో ముగియనుంది. మరి ఈరోజు ఎన్ని టెండర్లు నమోదు అవుతాయో వేచి చూడాల్సి ఉంది.