ఉండి నియోజకవర్గంలో కాలువ గట్టులపై అక్రమంగా నివాసం ఉంటూ త్రాగు మరియు సాగు నీటి కాలుష్యానికి కారణమవుతున్న సుమారు 70 కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన స్థలాలకు సంబంధించిన ఇళ్ళ పట్టాలను గురువారం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు లబ్ధిదారులకు అందజేశారు. రెండు రోజుల్లో ఈ ఆక్రమణలను తొలగించి తన నియోజకవర్గంలో నీటి కాలుష్యాన్ని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.