రేపటి నుంచి నూజివీడులో పశు గణన కార్యక్రమం

65பார்த்தது
రేపటి నుంచి నూజివీడులో పశు గణన కార్యక్రమం
నూజివీడు డివిజన్లోని 10 మండలాల్లో ఈ నెల 25 నుంచి పశుగణన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పశుసంవర్ధకశాఖ నూజివీడు డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖరరావు గురువారం తెలిపారు. పశుగణనకు గాను 157 మంది ఎన్యూమరేటర్లను, 19 మంది సూపర్వైజర్లను నియమించినట్లు పేర్కొన్నారు. పశుగణనలో భాగంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, వీధి కుక్కలు, పెరటి కోళ్లు, ఎద్దులు తదితర వివరాలను సేకరిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி