పోతిరెడ్డిపల్లిలో ఆలయాన్ని కూల్చిన వారిపై చర్య తీసుకోవాలి

52பார்த்தது
గత రెండు నెలల కిందట నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు శివరామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పోతిరెడ్డిపల్లి లో మీడియాతో మాట్లాడారు. కొందరు కావాలని ఈ ఆలయాన్ని కూల్చివేసారని పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై పార్టీలకతీతంగా పోరాటం చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி