ప. గో: పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈవో

62பார்த்தது
ప. గో: పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈవో
పది పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ప. గో. జిల్లా డీఈవో ఇ. నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 10 వరకు గడువు పొడిగించారని, అపరాధ రుసుం లేకుండా నవంబర్ 18 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ. 50 అపరాధ రుసుంతో నవంబర్ 19 నుంచి 25 వరకు, రూ. 200 అపరాధ రుసుంతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ. 500 అపరాధ రుసుంతో డిసెంబర్ 4 నుంచి 10 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி