రాకపోకలకు ఇబ్బందులు కలిగించేలా ప్రధాన రహదారులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మండవల్లి గ్రామ సర్పంచి మెండా ఝాన్సీ అన్నారు. బుధవారం మండవల్లి జాతీయ రహదారి కాలువ వెంబడి ఆక్రమణలను పోలీసు సిబ్బందితో కలిసి తొలగించి పరదాలు కట్టించారు. రోడ్డు మార్గాలను సొంత స్థలాల్లా వినియోగించుకుని భారీ దుకాణాలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. పంచాయతీ కార్యదర్శి కొండలు, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.