ప్రజలకు పూర్తి అందుబాటులో కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కొవ్వాడలంక గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో ఉండి ఇటీవలే విజయవాడ వరదల్లో ఎంత కష్టపడ్డారో అందరూ చూశారు. ఈ వంద రోజులు కూటమి ప్రభుత్వం టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేసిందన్నారు.