దెందులూరు మండలం రామారావుగూడెంకు చెందిన భాస్కరరావు(48) ఇంటి నిర్మాణానికి లోన్ తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సమయానికి వాయిదా చెల్లించలేదు. అయితే. లోన్ ఏజెంట్ల వేధింపులు భరించలేక తాను చనిపోతున్నానని, పిల్లల్ని బాగా చూసుకోవాలని భార్యకు భాస్కర్ రావు ఫోన్లో చెప్పాడు. దీంతో వెంటనే ఆమె 112 ఫోన్ చేసింది. స్పందించిన పోలీసులు పెదవేగి మండలం వేగివాడ బ్రిడ్జి వద్ద ఉన్న భాస్కరరావును రక్షించారు.