2500 ఎకరాలు వరి పంట నీట మునక

52பார்த்தது
2500 ఎకరాలు వరి పంట నీట మునక
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని 2500 ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. నేటికీ పొలాల్లో వరదనీరు ఉంది. సకల కొత్తపల్లికి చెందిన కౌలురైతు చేపేని అప్పన్న, సోదరుడు రంగారావులు కలిసి 18 ఎకరాల్లో వరి సాగుచేశారు. పంటంతా వరదార్పణమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా ఒక్కింటికి రూ. 20వేలు చొప్పున రూ. 3, 60, 000 ఖర్చయ్యిందని, కౌలుకు ఎకరా ఒక్కింటికి రూ. 25 వేల చొప్పున రూ. 4, 50, 000 చెల్లించాల్సి ఉందన్నారు.

தொடர்புடைய செய்தி