కామవరపుకోట మండలంలో పట్టభద్రుల ఓట్ల నమోదు వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. ఈ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు ఓటు వేసేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.