గ్రామ సభల ద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చింతలపూడి తహసిల్దార్ ప్రమద్వర అన్నారు. శుక్రవారం మండలంలోని రీ సర్వే జరిగిన గొన్నెపల్లి గ్రామంలో ఆమె గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. రీ సర్వేలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో 7 దరఖాస్తులు వచ్చాయన్నారు.