ప.గో జిల్లాలో సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించిన టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారిణి జి. నాగమణి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం కార్యాలయంలో ఆమె మాట్లాడారు. అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి ఈ నెల 15న, రూ. 200 అపరాధ రుసుముతో ఈ నెల 16 నుంచి 25 వరకు గడువు ఉన్నట్లు తెలిపారు.