భీమవరం: సరసమైన ధరలకే సరుకులు: కలెక్టర్

58பார்த்தது
భీమవరం: సరసమైన ధరలకే సరుకులు: కలెక్టర్
బహిరంగ మార్కెట్లో వంట నూనెలు, టమాటాలు, ఉల్లిపాయలు రేట్లు నియంత్రణకు ప్రభుత్వం ద్వారా సరసమైన ధరలకు అందిస్తున్న అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం స్థానిక ఫ్లైఓవర్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన నిత్య అవసరాల సరుకుల అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెసి టి. రాహూల్ రెడ్డి, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி