ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలాగా అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని తూ. గో జిల్లా జేసీ ఎస్. చిన్న రాముడు ఆదేశించారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అధికంగా ఉన్నాయని వాటిని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు.