పెద్దాపురం: పీసా శిక్షణా తరగతులు ముగింపు
గిరిజన ఆవాస ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధికి పీసా చట్టం అమలుపై సామర్లకోట విస్తరణ శిక్షణా కేంస్రం ఆవరణలో రెండు రోజులుగా జిల్లాలోని వివిధ మండలాల అధికారులకు ఇస్తున్న రైట్ షాప్ పేరిట అవగాహన సదస్సు గురువారం విజయంవంతంగా ముగిసింది. శిక్షణార్థులకు సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్ వేణుగోపాల్ చేతుల మీదుగా అందజేశారు. సుమారు 100 మంది అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.