మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనంలో ఎలాంటి లోపంలేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని గురువారం జాయింట్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. ఫుడ్ పాయిజన్ కు గురై చికిత్స పొందుతున్న మాగనూరు విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగులు ఉన్నాయనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. జిల్లా అధికార యంత్రాంగం ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్త పరిచారు.