పెద్దాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మంగళవారం నిర్వహించిన దాడుల్లో జగ్గంపేట మండలంలోని కాట్రాళ్లపల్లి రమేష్ పేట రహదారిలో నాటు సారా తయారీ కోసం సిద్ధం చేసిన 800 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ సీఐ అర్జున్ రావు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆకర్షణ తనిఖీలు చేపట్టగా, నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములలో బెల్లం ఊటను గుర్తించినట్లు ఆయన తెలిపారు.