కార్తీకమాసం మహా పర్వదినాలలో భాగంగా మూడవ రోజు తొలి సోమవారం సందర్భంగా సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో విశేష పూజలు నిర్వహించారు. తొలి సోమవారం కావడంతో తొలి అభిషేక పూజలు వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఈవో బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో భక్తులకు సదుపాయాలు కల్పించారు.