రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడుతున్న ఉచిత గ్యాస్ పథకం అందరికి వర్తింప చేయాలని, ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని సీపీఎం జిల్లా నేత శేషు బాజ్జీ డిమాండ్ చేశారు. సోమవారం పెద్దాపురంలోని యాసలపు సూర్యారావు భవన్ లో సీపీఎం పెద్దాపురం మండల మహాసభ జరిగింది. సీపీఎం సీనియర్ నేత చల్లా విశ్వనాథం సీపీఎం పతాకాన్ని ఆవిష్కరించారు.