రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై చినబాబు మాట్లాడుతూ.. యువత గంజాయి, సారా తయారీ, రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వలన జీవితాలు నాశనం అవుతాయన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.