గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు కూడా పేదలైన లబ్ధిదారులకు ఇవ్వలేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.