రాజమండ్రి నగరంలోని ఆనం కళా కేంద్రం వద్ద స్వర్ణాంధ్ర @2047లో భాగంగా జిల్లా విజన్ ప్లాన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొని మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రజలు, యువత మేధావుల నుంచి సలహాలు, సూచనలు అందుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.