ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అక్టోబర్ 14వ తేదీన యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. కావున ప్రజల నుంచి అర్జీలను స్వీకరించుటకు కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు, అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.