రాజమండ్రి నగరంలోని ఆవ రోడ్డులో రూ. 10 లక్షల నిధులతో ఆధునికీకరించిన మేకలు, గొర్రెల జంతు వధశాలను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జంతు వధశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ జనరేటర్, స్లాట్స్ కటింగ్ మిషన్లను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మటన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా సభ్యులు పాల్గొన్నారు.