రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో.. ప్రజల నుంచి 12 అర్జీలను స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.