నిడదవోలు పురపాలక సంఘ మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. వైసీపీకి చెందిన 25 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఆదినారాయణ అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ..` అజెండాలకు తీసుకొచ్చిన అంశాలు కౌన్సిలర్లకు తెలియకుండా అజెండాలోకి తెచ్చారని దానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.