సఖీనేటిపల్లి మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు. స్టీమర్ రేవు, బాడిరేవు ప్రాంతాలలో రెండు రోజులుగా కుళాయి ద్వారా తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసైనికులు శనివారం జనసేనపార్టీ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్ ద్వారా ఇంటింటికీ ఉచితంగా నీటిని సరఫరా చేశారు.