కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం నియోజక వర్గం పరిధిలోని ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారిని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుతన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే వేగుళ్ళకు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే వేగుళ్ళ ఆకాంక్షించారు.