ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలని స్థానిక గ్రంథాలయం వద్ద బయట వ్యక్తులు చెత్తను తెచ్చి వేయడంతో గ్రంథాలయానికి వచ్చే పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గురువారం పంచాయితీ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావు దృష్టికి గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు తీసుకుని వెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి స్వయంగావచ్చి పరిశీలించి సిబ్బందిచే చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దారు.