ఘనంగా ప్రపంచ యోగ దినోత్సవం

1095பார்த்தது
ఘనంగా ప్రపంచ యోగ దినోత్సవం
స్థానిక రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు వ్యాయామ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో రావులపాలెం గ్రామంలో గల పార్కు నందు అనేకమంది ప్రజలను సమీకరించి శుక్రవారం ఉదయం 6: 30 నుండి 7: 30 నిమిషాల వరకు ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా యొక్క అవశ్యకత ఉపయోగాలను వివరించి అనేక రకాల ఆసనాలను అభ్యసన చేయించడం జరిగింది. ఆరోగ్యకరమైన మానవ ప్రపంచాన్ని సృష్టించడం దీని ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రస్థాయి ఉత్తమ యోగాబ్యాసకురాలిగా బహుమతి పొందిన రావులపాలెం కళాశాల విద్యార్థిని ఏ. అంజలిదేవి చేత యోగాసనాలను చేయించడం జరిగింది. మరల ఉదయం 10: 30 గంటలకు కళాశాల ప్రాంగణం నుండి విద్యార్థుల చేత కూడా యోగాసనాలు చేయించడం జరిగింది ఏ. అంజలీదేవిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే జ్యోతి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్ చినబాబు, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, పిడి యువరాజు, తదితర అభ్యర్థులను పాల్గొని విజయవంతంగా నడిపించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி