స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావులపాలెం నందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే జ్యోతి అధ్యక్షతన జిఎస్ఎల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం వైద్యులు డాక్టర్ కె మంజుషా ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి దాని ప్రభావం, నిరోధక విధానాలు చికిత్స గురించి విద్యార్థి విద్యార్థినులకు వివరించి క్యాన్సర్ బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా తమ శిరోజాలను కోల్పోవడం జరిగిందని వాటిని తిరిగి వారికి ఏర్పడేలా చేయుటకు అవసరమైన శిరోజాలను విద్యార్థిని
విద్యార్థులు మరియు సమాజంలో ఎవరైనా తమ శిరోజాలను దేవాలయాలలో ప్రార్ధన మందిరాల్లో మొక్కుబడుల రూపంలో వృధా చేయకుండా క్యాన్సర్ బారిన పడిన వ్యాధిగ్రస్తులకు తమ శిరోజాలను దానం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే జ్యోతి , ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కె రజిని , ఎన్ ఝాన్సీ , జి పూజ తదితర అధ్యాపకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించారు.