గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు పల్లె పండుగ కార్యక్రమం దోహదపడు తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.