విద్యార్థి అటు తరగతి గదిలో గాని, ఇటు ఆయా పాఠ్యాంశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధించే అంశాలను ఆకళింపు చేసుకుని ఏకాగ్రతతో పరిశ్రమించినపుడే ఉన్నత స్థాయికి చేరేందుకు మార్గం సుగమమవుతుందని కాకినాడ జెఎన్టియుకె ఇంఛార్జ్ ఉపకులపతి ప్రొ. కెవిఎస్. మురళీకృష్ణ తెలిపారు. కాకినాడలో జి-కన్వెన్షన్ హాలులో మంగళవారం ఉదయం శ్రీ అగస్త్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో 'బికమింగ్ ఏ జీనియస్' అనే అంశంపై సదస్సు నిర్వహించారు.