జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు.జగ్గంపేటలోని పాత పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్లో నిరుపేద లైన సుమారు 300 మందికి భోజనాలను జనసేన సైనికులు స్వయంగా పంపిణీ చేశారు.