ద్వారకా తిరుమల మండలం ఐ. ఎస్. జగన్నాథపురంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుమతులకు విరుద్ధంగా సాగిన రెడ్ గ్రావెల్ తవ్వకాలపై విచారణ చేయాలని ఆదేశాలతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 20. 95 ఎకరాల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం సాగించినట్లు అధికారులు శనివారం గుర్తించారు.