దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై వెళుతున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌పై గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.