సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అనపర్తి ఎస్ఐ శ్రీను నాయక్ అన్నారు. అనపర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఎస్ఐ శ్రీను నాయక్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలలు సహకారం చేయాలని సూచించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.