సామర్లకోట కేనాల్ రోడ్లో జీ. మేడపాడు పరిసరాల్లో వాహనదారులకు ప్రమాదాలు కలిగిస్తున్న పెద్ద గోతులను పూడ్చివేయడానికి శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. తెలుగు రైతు కాకినాడ పార్లమెంట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ స్థాయిలో నుండి పాలవూరు నాయకులు కూడా పాల్గొని, శ్రీనుబాబును అభినందించారు.