ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనసుకు చాలా బాధేస్తోందని వైఎస్ విజయమ్మ అన్నారు. ‘‘వైఎస్ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. తెలిసి కొంత.. తెలియక కొంత మాట్లాడుతున్నారు. ఇవి కంటిన్యూ అవ్వొద్దు. నా పిల్లలిద్దరికే కాదు.. చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయొద్దు’’ అని ఆమె కోరారు.