కలెక్టరయ్యా మేము ఆరు గాలం కష్టపడి కట్టుకున్న ఇళ్లకు రెవెన్యూ అధికారులు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు కాళ్లావేళ్లా పడుతున్నా కనికరించడం లేదంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఎదుట సైదాపురం మండలంలోని చిన్నన్నపేట గ్రామస్తులు తమ ఆవేదన వెళ్లగక్కారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ స్పందిస్తూ సమస్య పరిష్కరించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనను ఆదేశించారు.