వేయి కళ్ల కుండలతో మోక్కులు తీర్చుకున్న భక్తులు

59பார்த்தது
వేయి కళ్ల కుండలతో మోక్కులు తీర్చుకున్న భక్తులు
వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతరలో గురువారం ఉదయం నుండి భక్తుల తాకిడి ఎక్కువైంది అమ్మవారికి మొక్కులు ఉన్నవారు వేయికళ్ల కొండలతో జై పోలేరు అంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి నిజరూప దర్శనం ఉదయం నుండి ప్రారంభం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరి కోసం పోలీసులు దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాయంత్రం అమ్మవారిని సాగనంపుతారు.

தொடர்புடைய செய்தி