సనాతన ధర్మం నమ్మితే పవన్ కళ్యాణ్ పాలించడానికి అనర్హుడు
సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడమే తన ధ్యేయమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న దాన్ని బట్టి చూస్తే, పవన్ ఆ పదవిలో ఉండడానికి అనర్హుడని సీనియర్ జర్నలిస్ట్ రాఘవ గుర్తు చేశారు. 'సనాతన ధర్మం- ప్రస్తుత రాజకీయాలు'అనే అంశంపై సామాజిక హక్కుల వేదిక అధ్వర్యంలో బుధవారం సాయంత్రం తిరుపతిలో సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి చిన్నం పెంచలయ్య అధ్యక్షతన చర్చా గోష్టి జరిగింది.