శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. తిరుమలలో రూ. 13. 40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను శనివారం సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం. రాబోయే రోజుల్లో భక్తుల నుండి అభిప్రాయం తీసుకుంటామని సీఎం అన్నారు.