తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. జేసీబీల ద్వారా సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. మరోవైపు తిరుమల గిరుల్లో వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది. కొండల నుంచి వస్తున్న నీటితో తిరుపతి కాలనీల్లోకి వరద వచ్చి చేరుతోంది.