ప్రపంచంలోని అత్యంత ఇరుకైన రోడ్లలో ఇది కూడా ఒకటి. అయితే, ఇక్కడో విశేషం ఉంది. పాదచారులు నడవడానికి మాత్రమే ఈ సందు సరిపోతుంది. అదీ ఇద్దరు ఒకేసారి పక్కపక్కన వెళ్లడానికి లేదు. ఒక్కరు మాత్రమే వెళ్లగలరు. ఇందులో వెళ్లడానికి రహదారి ప్రవేశ ద్వారం వద్ద ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రారంభంలో ఉన్న సిగ్నల్ బటన్ నొక్కితే అటుపక్క వారికి రెడ్ సిగ్నల్ పడుతుంది. దీంతో వారు అక్కడ ఆగిపోతారు.