సత్యవేడు పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త ఈశ్వర్ అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న వైసీపీ సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేశ్ వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.