తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో వర్షం దంచికొడుతోంది. ఫెంగల్ తుఫాన్ కారణంగా శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం శనివారం తెల్లవారుజామున వరకు కురుస్తూనే ఉంది. వర్షం కారణంగా మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల వీధులు జలమయమయ్యాయి. మండలంలో చలి తీవ్రత పెరిగింది. అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు.